కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కానీ సినిమా భారీ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. సూపర్ స్టార్ నెక్స్ట్ వెట్టైయాన్ లో కనిపించనున్నారు. జై భీం ఫేమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం, ఈ సినిమా 2024 దీపావళికి విడుదల కానుంది.
ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్ మరియు రితికా సింగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.