ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సురేఖ బ‌హుమ‌తి.. వీడియో పోస్ట్ చేసిన చిరంజీవి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సురేఖ బ‌హుమ‌తి.. వీడియో పోస్ట్ చేసిన చిరంజీవి

Published on Jun 15, 2024 6:00 PM IST

న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న కుటుంబ సభ్యులైన మెగా ఫ్యామిలీ ఆయ‌న‌కు ఏ విధంగా శుభాకాంక్ష‌లు తెలిపారో మనం చూశాం. మెగాస్టార్ చిరంజీవితో స‌హా మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ఆయ‌న‌కు గ్రాండ్ వెల్క‌మ్ చెప్పి, ఆయ‌న విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అయ్యింది.

అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి మ‌రో వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. “క‌ళ్యాణ్ బాబుకు వ‌దిన‌మ్మ సురేఖ బ‌హుమ‌తి” అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిరు సతీమ‌ణి సురేఖ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఓ పెన్ ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. ప‌వ‌న్ చొక్కాజేబులో ఆమె స్వ‌యంగా పెన్ ను పెట్ట‌డం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఇటీవ‌ల‌ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. అభిమానులు ప్ర‌స్తుతం ఈ వీడియోను చూసి భాగోద్వేగానికి లోన‌వుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు