’18 పేజెస్’ సినిమా ఎండింగ్ మాత్రం అలా గుర్తుండిపోతుంది – డైరెక్టర్ సూర్య ప్రతాప్

’18 పేజెస్’ సినిమా ఎండింగ్ మాత్రం అలా గుర్తుండిపోతుంది – డైరెక్టర్ సూర్య ప్రతాప్

Published on Dec 20, 2022 11:26 PM IST

ఇటీవల కార్తికేయ 2 మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న నిఖిల్ సిద్దార్థ లేటెస్ట్ గా నటించిన మూవీ 18 పేజెస్. ఈ మూవీకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ మూవీ డిసెంబర్ 23న విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు సూర్య ప్రతాప్ నేడు ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు.

 

కుమారి 21 ఎఫ్ తరువాత మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది ?

ఫస్ట్ మూవీ కరెంట్ తరువాత నేను సుకుమార్ గారి టీమ్ లో జాయిన్ అయ్యాను. అనంతరం కుమారి 21ఎఫ్ మూవీ థాట్ రావడం, ఆపైన మూవీ తీయడం జరిగింది. అయితే ఆ తరువాత సుకుమార్ గారు తీస్తున్న రంగస్థలం, పుష్ప సినిమాలకు కూడా వర్క్ చేస్తే మరింత నేర్చుకోవచ్చు అనే భావనతో వారితోనే కొనసాగాను, అవి నాకు ఈ సినిమా కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.

 

కుమారి 21 ఎఫ్ తరువాత ఈ మూవీ ఎంచుకోవడానికి కారణం ఏంటి ?

ఈ మూవీ క్యారెక్టర్స్ యొక్క జర్నీతో సాగుతుంది, ఇందులో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఆడియన్స్ అందరికీ అవి కనెక్ట్ అవడంతో పాటు వారిని అవి ఎంతో ఆకట్టుకుంటాయి.

 

ఇది ఎటువంటి లవ్ స్టోరీ అని చెప్తారు ?

ఇది ఒకరకంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఆడియన్స్ ఈ కథనంతో ట్రావెల్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో తమని తాము క్వశ్చన్ చేసుకుంటారు. మధ్యలో వచ్చే ఫన్ సీన్స్ తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా అలరిస్తాయని నమ్మకం ఉంది. అలానే క్లైమాక్స్ అయితే వారందరి మదిలో అలా గుర్తుండిపోతుంది.

 

కార్తికేయ 2 తరువాత హీరోగా నిఖిల్ కి ఎంతో పెద్ద రీచ్ వచ్చింది, ఆయన కోసం కథలో మార్పులు చేసారా ?

ముఖ్యంగా ఏ సినిమాకి అయినా కథే కదా ముఖ్యంగా. ఇక్కడ మనం అనుకున్న కథని అలానే తీయాలి, మా అన్నయ్య సుకుమార్ గారు కూడా అదే చెప్తారు, కథే కింగ్ అని. అయితే నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి కథలో మార్పులు చేయలేదు కానీ అక్కడక్కడా కొద్దిగా కథనం మార్చాము అంతే. ఇక నిఖిల్ కూడా నాకోసం ఎటువంటి చేంజెస్ చేయవద్దు, మీరు మొదట చెప్పిన కథనే తీద్దాం అంటూ ప్రోత్సహించారని అన్నారు.

 

మైత్రి మూవీ మేకర్స్ వారితో ఒక ప్రాజక్ట్ అనౌన్స్ చేసారు కదా, దాని గురించి చెప్పండి ?

మైత్రి వారి తో ఒక ప్రాజక్ట్ పెండింగ్ ఉంది, అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ తో కూడా ఒక మూవీ చేయాల్సి ఉంది. వీలైతే తదుపరి సినిమా మైత్రి వారిదే అవ్వొచ్చు. ఇక సుకుమార్ గారి దగ్గర ఐదు కథలు తీసుకున్నాను, అందులో రెండు కథలు అయ్యాయి, మరొక మూడు ఉన్నాయి, అలానే నేను రాసిన మరొక కథ కూడా ఓకె అయింది.

 

ట్రైలర్ లో కొంత కథ చెప్పేసారు కదా, మరి అది సినిమాని కొత్తగా ఆశించిన వారికి సర్ప్రైజింగ్ గా ఉంటుందా ?

ఉదాహరణకు మనం ఒక జిలేబి తింటుంటే అది తియ్యగా ఉంటుందని మనకు తెలుసు. కానీ తిన్న తరువాత దాని యొక్క రుచిని ఆస్వాదిస్తాం, అందులోని తియ్యదనాన్ని రుచి చూశామా లేదా అంతే ముఖ్యం. సినిమా కథ అనేది ఆడియన్స్ అనుకున్న విధంగానే ఉండొచ్చు కానీ, జర్నీ ఇంపార్టెంట్ కదా అది నేను ట్రైలర్ లో క్లియర్ గా చూపించాను.

 

గీతా ఆర్ట్స్ సంస్థ గురించి ఏమి చెప్తారు ?

నిజంగా గీతా ఆర్ట్స్ వంటి గొప్ప సంస్థలో వర్క్ చేయడం నా హానర్ అనే చెప్తాను. మీరు ఎవరి సంస్థలో చేస్తున్నారు అంటే గీతా ఆర్ట్స్ వారితో అంటూ గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక వారి ప్రాముఖ్యత ఏమిటంటే, మనం ఏదైనా కథ చెప్పి ఓకె అయిన తరువాత మనం కాంప్రమైజ్ అయినా వారు మాత్రం కారు. ముఖ్యంగా అరవింద్ గారు, బన్నీ వాసు గారు ఇద్దరూ కూడా చాలా మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ప్రొడక్షన్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు.

ఓకె ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ… థాంక్యూ

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు