దివ్యాంశ కౌశిక్ : రామారావు ఆన్ డ్యూటీ తప్పకుండా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది

Published on Jul 24, 2022 12:00 am IST

రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ గా శరత్ మండవ మెగాఫోన్ పట్టిన ఈ మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డాం అని, తప్పకుండా మూవీ మంచి సక్సెస్ అవుతుందని హీరో రవితేజ అంటున్నారు. దివ్యాంశ కౌశిక్, రాజీష విజయన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో వేణు తొట్టెంపూడి ఒక కీలక రోల్ చేస్తుండగా లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఈ నెల 29న రామారావు ఆన్ డ్యూటీ ప్రేక్షకుల ముందుకు రానుండగా నేడు కొద్దిసేపటి క్రితం మూవీకి సంబదించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు హీరోయిన్ దివ్యాంశ.

 

మజిలీ తరువాత మీ కెరీర్ కి గ్యాప్ రావడానికి కారణం ?

వాస్తవానికి కరోనా మహమ్మారి వలన అందరికీ కొంత ఇబ్బంది వచ్చింది. అయితే ఆ సమయంలో నేను ఎక్కువగా డ్యాన్స్, తెలుగు నేర్చుకొవడంతో పాటు నన్ను నేను మరింత ప్రతిభావంతంగా మార్చుకునేందుకు ప్రయత్నించాను. అనంతరం నా ఇన్స్టాగ్రామ్ లో పలు ట్రెడిషనల్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వచ్చాను. అవి చూసి ఎంతో నచ్చిన దర్శకుడు శరత్ మండవ నన్ను కలిసి ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు.

 

శరత్ గారు కథ చెప్పినపుడు ఈ మూవీకి సంబంధించి మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి ?

నేను రవితేజ గారికి పెద్ద అభిమానిని, ఆయనతో వర్క్ చేయడం కోసం ఎప్పటి నుండో ఎదురు చూసాను, ఆ కోరిక ఈ మూవీ ద్వారా తీరడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక దర్శకుడు శరత్ ఎంతో క్లారిటీ ఉన్న డైరెక్టర్. తను మూవీ స్టోరీని అలానే నా పాత్రని గురించి ఎంతో చక్కగా వివరించారు. నేను ఈ మూవీలో నందిని పాత్రలో కనిపిస్తాను. భార్యగా తల్లిగా ఎంతో హోమ్లీ గా ఉంటుంది నా పాత్ర. 1995ల నాడు జరిగిన కథగా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ తప్పకుండా ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది.

 

రవితేజ గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

నాకు ఎంతో ఇష్టమైన రవితేజ గారితో ఫస్ట్ టైం చేయడం ఎంత ఆనందంగా అనిపించిందో, మూవీ కోసం ఆయనని ఫస్ట్ టైం కలిసినపుడు మరింత ఎగ్జైటింగ్ గా అనిపించింది. నన్ను కలిసిన వెంటనే ఆయనే మీరు ఢిల్లీ నుండి వచ్చారా లేక ముంబైనా అంటూ సరదాగా మాట్లాడి నాలోని భయాన్ని పోగొట్టారు. ఆయన సెట్స్ లో అందరితో ఎంతో సరదాగా ఉండడంతో పాటు అందరిలో ఫుల్ ఎనర్జీ నింపుతారు. వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసు ఆయనది. ఇక ఈ మూవీ కోసం స్పెయిన్ లో కొంత భాగం షూట్ చేసాము. ఆ సమయంలో పలువురు పాకిస్థానీ, జర్మనీ దేశస్థులు రవితేజ గారిని చూసి ఆయనతో ఫోటో కోసం ఎంతో ఎగబడ్డారు. హీరోగా ఆయనకి యూనివర్సల్ గా సూపర్ ఫాలోయింగ్ ఉంది.

 

ఈ మూవీలో పాత్ర కోసం ఏమైనా హోమ్ వర్క్ చేసారా ?

ఈ మూవీలో ఒకరకంగా నాది చాలా బలమైన పాత్ర. ఇటువంటి పాత్ర చేయాలని ఎప్పటి నుండో ఎదురు చూసాను. దాని కోసం దాదాపుగా నెల రోజుల పాటు యాక్టింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్నాను. అనంతరం మూవీలో సీన్స్ చేయడం ఎంతో ఈజీ అనిపించింది. దర్సకుడు శరత్ అన్నింటా తోడుగా ఉన్నారు. అనే కథని పక్కాగా నాకు వివరించడంతో నాకు పాత్రని బట్టి మరింత బలంగా నటనకు అవకాశం దొరికినట్లయింది.

 

ట్రైలర్ లో రవితేజ గారు ఎంతో ఫిరోషియస్ గా కనిపించారు. మరి మీరు ఎంత ఫిరోషియస్ గా ఉంటారు ?

ఇందులో నాది హోమ్లి రోల్ అండి. రామారావు పాత్రకి భార్యగా అలానే ఆయనకి అన్నింటా సపోర్ట్ గా నిలిచే వ్యక్తిగా కనిపిస్తాను .తప్పకుండా నా పాత్ర మీ అందరికీ ఎంతో నచ్చుతుంది.

 

మజిలీ లో బాబ్లీ గర్ల్ గా కనిపించారు. మరి ఇందులో హోమ్లి వైఫ్ గా చేసారు. పాత్రలను ఎటువంటివి చేయడానికి మీరు ఇష్టపడతారు. ?

బబ్లి గర్ల్ గా చేయడం సులువే కానీ ఈ మూవీలో నందిని రోల్ కొంత బలంగా మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉంటుంది. ఇక ఈ రోల్ చేయడానికి ఏమాత్రం కష్ట పడకుండా మెల్లగా యూనిట్ సపోర్ట్ తో ఎంజాయ్ చేస్తూ నటించాను.

 

మూవీలో మీ పాత్రకి డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా ?

లేదండి నా పాత్రకు ఇందులో నేను డబ్బిగ్ చెప్పలేదు. అయితే నేను చేస్తున్న మరొక మూవీలోని రోల్ కి చెప్తున్నాను. తెలుగు మాట్లాడితే అర్ధం అవుతుంది. పూర్తిగా తెలుగుని నేర్చుకుని భవిష్యత్తులో నా రాబోవు సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్తాను.

 

రజీషా విజయన్ గురించి ?

ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా ఉంటుంది. అలానే తనతో కలిసి నేను ఒక సీన్ లో కనిపిస్తాను. మొదటి నుండి ఇద్దరి మధ్య పెద్దగా పరిచయం లేనప్పటికీ, ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఇద్దరం ఎక్కువగా కలవడంతో మంచి స్నేహితులం అయ్యాము.

 

నాగ చైతన్య, రవితేజ లతో నటించారు కదా, వారిద్దరిలో ఎటువంటి తేడా గమనించారు ?

నిజానికి ఇద్దరి వ్యక్తిత్వాలు వేరు అనే చెప్పాలి. రవితేజ మంచి ఎనర్జిటిక్ పర్సన్ అయితే చైతు కొంత కామ్ గా ఉంటారు. కానీ ఇద్దరిలో ఒక మంచి కామన్ పాయింట్ ఏంటంటే, సెట్స్ లో అందరితో ఇద్దరూ కూడా ఎంతో సరదాగా కలుపుగోలుగా ఉంటారు.

 

రామారావు ఆన్ డ్యూటీ టీమ్ తో మీ అనుబంధం ?

మూడేళ్ళ తరువాత ఈ మూవీ ద్వారా కెమెరా ముందుకి వచ్చాను. మొదటి నుండి కూడ దర్శకుడు శరత్ మండవ నాకు నటన విషయంలో ఎంతో హెల్ప్ చేయడంతో పాటు ఎంతో స్వేచ్చని కూడా ఇచ్చారు. ఇక ప్రతి సీన్ షూట్ తరువాత సూపర్ గా చేసారు అంటూ మానిటర్ లో చూస్తూ అభినందించేవారు. అలానే మిగతా టీమ్ మొత్తం కూడా అన్ని విషయాల్లో ఎంతో ప్రోత్సాహం అందించారు. అది ఎప్పటికీ మర్చిపోలేను.

 

దర్శకుడు కథ చెప్పినపుడు మీరు ఎటువంటి ఎలిమెంట్స్ అందులో చూస్తారు ?

ముందుగా దర్శకుడి విజన్ ని అలానే ఆయన విజన్ ని నమ్ముతాను కూడా. శరత్ తో పాటు నేను పనిచేసిన దర్శకులు మంచి విజనరీ క్వాలిటీస్ కలిగిన వారు అవడం నా అదృష్టం.

 

రామారావు ఆన్ డ్యూటీ నిర్మాతల గురించి ?

ఎస్ఎల్విసి సంస్థ తో పాటు రవితేజ టీమ్ వర్క్స్ వారు కలిసి ఈ మూవీని ఎంతో క్వాలిటీతో నిర్మించారు. వారికి సినిమా పట్ల ఉన్న ఫ్యాషన్ కారణంగా అన్నింటా ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ విలువలు ఉండేలా చూసుకున్నారు. ఇటువంటి వారితో వర్క్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది.

 

ఏయే హీరోలతో పని చేయాలనీ కోరుకుంటున్నారు ?

మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా అందరు హీరోలతో వర్క్ చేయాలని ఉంది.

 

టాలీవుడ్ కి, బాలీవుడ్ ఉన్న తేడాలు ఏమైనా గమనించారా ?

రెండు ఇండస్ట్రీల్లోనూ సినిమా పట్ల ప్యాషన్ ఒక్కటే. రెండిట్లో సినిమాలని ఎంతో గొప్పగా తీస్తారు. అయితే తెలుగు ప్రేక్షకులు యొక్క ప్రేమ మరింత ప్రత్యేకం అని చెప్పాలి. మజిలీ మూవీకి వారి నుండి నాకు లభించిన ప్రేమ వెలకట్టలేనిది.

 

ఈమధ్య చాలా సన్నబడ్డాడు కదా, మీ డైట్ సీక్రెట్ చెప్పండి ?

మజిలిలో బాబ్లీ రోల్ కోసం అలా ఉన్నాను. అనంతరం సన్నాబడాలని ఆలోచనతో ఎక్కువగా డ్యాన్స్ క్లాస్ లకు అటెండ్ అయ్యాను. ఇక స్పెషల్ డైట్ అనేది ఏమి లేదు, నాకు ఏది తినాలనిపిస్తే అదే తింటాను.

 

ఎటువంటి మూవీస్ చేయాలని ఉంది ?

అన్ని రకాల పాత్రలు చేయాలనే ఆశతో పాటు నమ్మకం కూడా ఉంది. అలానే ప్రత్యేకంగా బయోపిక్ మూవీస్ కూడా చేసే సామర్ధ్యం నాలో ఉందని భావిస్తున్నా.

 

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

సుధీర్ వర్మ గారితో ఒక సినిమా, అలానే మైఖేల్ అనే మరొక మూవీ కూడా చేస్తున్నా.

మీ రామారావు ఆన్ డ్యూటీ తప్పకుండా పెద్ద సక్సెస్ కొట్టి మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలి. ఆల్ ది బెస్ట్ థాంక్యూ

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :