రవితేజతో సురేందర్ రెడ్డి.. నిజమేనా ?

రవితేజతో సురేందర్ రెడ్డి.. నిజమేనా ?

Published on Aug 1, 2020 10:59 PM IST

డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో భారీ సినిమా ‘సైరా’ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే పలానా హీరో నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సురేందర్ రెడ్డి, రవితేజతో ఒక ఫుల్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని.. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది.

ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సురేందర్ రెడ్డి రవితేజ కోసం స్క్రిప్టు సిద్దం చేస్తోనట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి- రవితేజ కాంబినేషన్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందుకే ఫుల్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా ఉండేలా.. ముఖ్యంగా రవితేజకు సరిపడే స్టోరీతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. మరి సురేందర్ రెడ్డి – రవితేజ కలయిక పై క్లారటీ వచ్చేదాకా ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు