సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘జానికి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె.ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బైజు సంతోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్గర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రాన్ని ఇంటెన్స్ కోర్టు డ్రామాగా మేకర్స్ రూపొందించారు.
ఇక ఈ సినిమాలో జానకి అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. జానకి తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అనే అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా.. ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా మేకర్స్ రూపొందించారు. ఆమె కేసు వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. కాగా ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు.