ఫిలింనగర్లో గణేషుడి లడ్డును వేలంలో దక్కించుకున్న సురేష్ కొండేటి.!

ఫిలింనగర్లో గణేషుడి లడ్డును వేలంలో దక్కించుకున్న సురేష్ కొండేటి.!

Published on Sep 15, 2024 9:30 AM IST

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అలా హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్ అని తెలిసిందే. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు.

ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి లక్ష్మీ( దగ్గుబాటి సురేష్ బాబు సతీమణి) సమక్షంలో సురేష్ కొండేటికీ అందజేశారు.. ఇక ఈ సందర్భంగా వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సురేష్ కొండేటి వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు