సూర్య 44 నుండి బిగ్ అప్డేట్… అద్దిరిపోయిన ఫస్ట్ షాట్!

సూర్య 44 నుండి బిగ్ అప్డేట్… అద్దిరిపోయిన ఫస్ట్ షాట్!

Published on Jun 2, 2024 9:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న సూర్య44 మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం నుండి బిగ్ అప్డేట్ ను రివీల్ చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ జరుగుతుంది అని మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే హీరో సూర్య పై షూట్ చేసినటువంటి ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేశారు.

వీడియో చాలా బాగుంది. సూర్య వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ను ఇందులో చూడవచ్చు. నవ్వుతూనే, సీరియస్ లుక్ లోకి మారిపోయాడు. వీడియో లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతం గా ఉంది. సూర్య ఫ్యాన్స్ కి ఇది మాంచి ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు