సూర్య 44 నుండి పవర్ ఫుల్ వీడియో రిలీజ్..!

సూర్య 44 నుండి పవర్ ఫుల్ వీడియో రిలీజ్..!

Published on Jul 23, 2024 12:25 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి కంగువ చిత్రంలో కనిపించనున్నారు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తరువాత సూర్య చేయబోయే ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సూర్య 44 అనే టైటిల్ ను తాత్కాలికంగా పెట్టడం జరిగింది.

అయితే నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్ ఫుల్ వీడియోను విడుదల చేయడం జరిగింది. సూర్య చాలా అగ్రెసివ్ గా వీడియోలో కనిపిస్తున్నాడు. సినిమా కోసం డిఫెరెంట్ మేకోవర్ అయ్యాడు సూర్య. ఈ లుక్ కి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హ్యాపీ బర్త్ డే టు ది వన్ అంటూ వచ్చిన క్యాప్షన్ అలరిస్తుంది. ఈ చిత్రంకు సంబందించిన టైటిల్ టీజర్ త్వరలో రిలీజ్ కానుంది అని వీడియోలో వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు