చెన్నై వరద బాధితులకు సూర్య బ్రదర్స్ ఆర్ధిక సాయం.!

మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోస్ లో సూర్య అలాగే తన తమ్ముడు కార్తీలు కూడా ఒకరు. మరి ఈ ఇద్దరి చిత్రాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండగా తమ నెక్స్ట్ సినిమాల కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తమిళనాట భారీ వర్షాలతో అక్కడ అనేక ప్రాంతాలు నీటి ఎద్దడి పెరిగిపోవడం మూలాన వరదల్లో మునిగిపోయాయి.

దీనితో వారి కోసం ఇప్పుడు సూర్య బ్రదర్స్ ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ బాధితుల కోసం సూర్య మరియు కార్తీ లు 10 లక్షలు రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించినట్టుగా తెలుస్తుంది. దీనితో వారి ఉదారత మరోసారి చాటుకున్నారని చెప్పాలి. ఇక సూర్య ఇప్పుడు తన భారీ చిత్రం “కంగువ” లో బిజీగా ఉండగా కార్తీ రీసెంట్ గానే “జపాన్” అనే చిత్రంతో తెలుగు తమిళ ఆడియెన్స్ ని పలకరించాడు.

Exit mobile version