నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసిన సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు. ఇక తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కూడా ఇటీవల ముగించుకున్నాడు సూర్య.

అయితే, ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు సూర్య. కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్‌జె బాలాజీ డైరెక్షన్‌లో సూర్య తన కెరీర్‌లోని 45వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version