వేదిక మీదే కన్నీటి పర్యంతమైన సూర్య

వేదిక మీదే కన్నీటి పర్యంతమైన సూర్య

Published on Jan 6, 2020 9:00 PM IST

సూర్య కేవలం రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడ. ప్రజలు అభివృద్ది చెందాలంటే చదువు తప్పనిసరిగా ఉండాలని భావించే ఆయన అగరం ఫౌండేషన్ స్థాపించి కోట్ల ఖర్చుతో ఎంతో మంది పేద విద్యార్దులకు చదువుకునే సౌకర్యాన్ని అందిస్తున్నారు. నిన్న తన ఫౌండేషన్ ద్వారం రెండు పుస్తకాల్ని రిలీజ్ చేశారు సూర్య.

ఈ కార్యక్రమంలో అగరం ఫౌండేషన్ ద్వారా చదువుకున్న విద్యార్థిని ఒకరు మాట్లాడుతూ మారుమూల గ్రామం నుండి వచ్చిన తను సరైన విద్య లేని కారణంగా అవమానాలు ఎదుర్కొన్నానని, అలాంటి సమయంలో అగరం ఫౌండేషన్ ద్వారా చదువుకుని ఇప్పుడు కేరళలో ఇంగ్లీష్ భోదిస్తున్నానని, సూర్య తనకు, తనలాంటి ఎందరో పేద విద్యార్దులకు దేవుడిలాంటి వారని కన్నీటి పర్యంతమైంది. ఆమె మాటలు విన్న సూర్య సైతం ఆసాంతం తన భావోద్వేగాన్ని ఆపుకున్నా చివరికి వేదిక మీదే కన్నీళ్ళు పెట్టుకున్నారు. వేడుకలో ఆ దృశ్యాన్ని చూసిన వారంతా సూర్య గొప్పతనానికి, సేవకు అభినందనలు కురిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు