‘బాహుబలి’లో సూర్య నటించడం లేదు..!

surya_bahubali

గత కొన్ని రోజులుగా తమిళ స్టార్ హీరో సూర్య ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఇదే వార్తను కొన్ని మీడియా చానెల్స్ వారు ప్రసారం చేయడం జరిగింది. ఈ గాలి వార్తను ‘బాహుబలి’ సినిమా యూనిట్ ఖండించింది. సూర్య ‘బాహుబలి’లో నటించడం లేదు అని స్పష్టం చేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రభాస్, తమన్నాలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.

భారి బడ్జెట్ తో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల కానుంది.

Exit mobile version