రికార్డు స్క్రీన్స్ లో సూర్య సినిమా రిలీజ్ ప్లాన్స్?

రికార్డు స్క్రీన్స్ లో సూర్య సినిమా రిలీజ్ ప్లాన్స్?

Published on Sep 15, 2024 6:15 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా రిలీజ్ కి రాబోతున్న భారీ చిత్రాల్లో మన సౌత్ నుంచి కూడా పలు చిత్రాలు వెళ్ళబోతున్నాయి. మరి ఈ చిత్రాల్లో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు శివ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కంగువా” కూడా ఒకటి. మరి ఎప్పుడు నుంచో తమిళ సినిమాలో మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాకి మేకర్స్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ఎక్కడా వెనుకాడడం లేదు.

ఇలా అన్ని అంశాల్లో కూడా రికార్డు ప్లానింగ్స్ ని మేకర్స్ చేస్తుండగా ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రాన్ని ఏకంగా 12 వేలు స్క్రీన్స్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇది కానీ నిజం అయితే RRR, కేజిఎఫ్, 2.0 లాంటి భారీ సినిమాల తరహాలో రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఆల్రెడీ ఈ సినిమా థియేట్రికల్ గా 10 భాషలలో ఓటిటిలో 30 భాషలకి పైగా రిలీజ్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు