సూర్య సినిమా పై డైరెక్టర్ బాల సంచలన ప్రకటన !

సూర్య సినిమా పై డైరెక్టర్ బాల సంచలన ప్రకటన !

Published on Dec 5, 2022 5:31 PM IST

స్టార్ హీరో సూర్య కి మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య నటించిన ఎన్నో సినిమాలు మన దగ్గర భారీ హిట్స్ అయ్యాయి. ఇక డైరెక్టర్ బాలతో సూర్యకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలో బాల – సూర్య కాంబినేషన్‌లో అచలుడు(తమిళ్‌లో వనన్‌గాన్) అనే సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమా ఆగిపోయింది. పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి సూర్య తప్పుకున్నట్లు బాల ప్రకటించాడు.

అచలుడు కథ హీరో సూర్యకి సరిపోదని, త్వరలోనే మరో కొత్త హీరోతో మూవీని స్టార్ట్ చేస్తా అని బాల తెలిపాడు. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఆగిపోవడం విచిత్రమే. పైగా వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నంద, శివపుత్రుడు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. పైగా సూర్య కెరీర్ కి అవి బాగా హెల్ప్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు