రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సూర్య ‘రెట్రో’

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సూర్య ‘రెట్రో’

Published on Jan 8, 2025 6:00 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ ‘కంగువా’ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా తర్వాత సూర్య ప్రస్తుతం తన కెరీర్‌లోని 44వ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇటీవల రిలీజ్ అవగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

‘రెట్రో’ సినిమాలో సూర్య వైవిధ్యమైన వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక-సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు