విలన్‌గా మరోసారి సూర్య.. ఏ సినిమాలో అంటే..?

విలన్‌గా మరోసారి సూర్య.. ఏ సినిమాలో అంటే..?

Published on Jan 9, 2025 7:44 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘కంగువా’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక దీంతో తన నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు సూర్య. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ హీరో.

‘రెట్రో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే సూర్య తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. ఆర్‌జె బాలాజీ డైరెక్షన్‌లో సూర్య తన కెరీర్‌లోని 45వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య హీరోగానే కాకుండా విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

ఇలా ఒకేసారి హీరోగా, విలన్‌గా సూర్య నటించడం ఇదేమి కొత్త కాదు. గతంలో ‘24’ చిత్రంలోనూ సూర్య ఇదే తరహా పాత్రల్లో నటించాడు. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు