సూర్య-విక్రమ్‌ల ’24’ షూటింగ్ పూర్తి!

సూర్య-విక్రమ్‌ల ’24’ షూటింగ్ పూర్తి!

Published on Nov 3, 2015 4:31 PM IST

surya
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’.. ఇలా సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో ట్రెండ్ సృష్టించిన విక్రమ్ కుమార్, ’24’ సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందించారని తెలుస్తోంది. ముంబై, చెన్నై, పోలండ్‌లలో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం నేటితో పూర్తైంది. సూర్య తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక చివరిరోజు షూటింగ్ సందర్భంగా సూర్య ట్విట్టర్‌లో టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 24 తన మనసుకు దగ్గరైన సినిమాల్లో ఒకటని ఈ సందర్భంగా సూర్య వ్యాఖ్యానించారు. సూర్య సరసన సమంత హీరోయిన్‍గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సంక్రాతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే దిశగా సూర్య టీమ్ ప్లాన్ చేస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు సరికొత్త కథాంశం అందరినీ కట్టిపడేసేదిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులను ప్రముఖ హీరో నితిన్ సొంతం చేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు