వాయిదా పడిన “కంగువా”… వేట్టైయాన్ కి సూర్య బెస్ట్ విషెస్!

వాయిదా పడిన “కంగువా”… వేట్టైయాన్ కి సూర్య బెస్ట్ విషెస్!

Published on Sep 1, 2024 8:01 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువా చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం అక్టోబర్ 10 కి రిలీజ్ కావాల్సిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని హీరో సూర్య నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో వెల్లడించారు. అయితే సూర్య కంగువా చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ యొక్క వేట్టైయాన్ తో పాటుగా రిలీజ్ చేయాలని భావించడం లేదు. కంగువా చిత్రం కోసం తాము ఎంతో హార్డ్ వర్క్ చేశామని, అభిమానులు అందరూ కూడా వాయిదా పడటం పట్ల అర్దం చేసుకోవాలని సూర్య కోరారు.

త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వేట్టైయాన్ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపారు సూర్య. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వేట్టైయాన్ చిత్రానికి టీ.జే. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు