అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ స్పై డ్రామానే “ఏజెంట్”. అయితే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కి ముందు భారీ హైప్ ఉండేది కానీ నెమ్మదిగా ఆలస్యం అవుతూ వస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు తగ్గాయి.
ఎలాగో థియేటర్స్ లోకి వచ్చాక ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఇక ఈ తర్వాత ఓటిటిలో రావడం అయితే పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఎప్పుడొస్తుంది అపుడొస్తుంది అని పలు వాయిదాలు పడి 2023 నుంచి 2025 కి క్యాలెండర్ మారిపోయింది.
కానీ ఇప్పుడు మాత్రం ఫైనల్ గా ఏజెంట్ ఓటిటిలోకి వచ్చేసింది. నిజానికి రేపు మార్చ్ 14న రావాల్సిన ఈ సినిమా నేడు మార్చ్ 13 సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చేసి సర్ప్రైజ్ చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే సోనీ లివ్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది.