స్వీట్ స‌ర్ప్రైజ్ ఇస్తానంటోన్న నివేదా థామ‌స్

స్వీట్ స‌ర్ప్రైజ్ ఇస్తానంటోన్న నివేదా థామ‌స్

Published on Jun 26, 2024 3:43 PM IST

అందాల భామ నివేదా థామ‌స్ కొంత గ్యాప్ త‌రువాత త‌న కొత్త సినిమాను ఇటీవ‌ల అనౌన్స్ చేసింది. రానా ద‌గ్గుబాటి నిర్మాత‌గా తెర‌కెక్క‌నున్న ’35’ అనే సినిమాలో నివేదా న‌టిస్తోంది. ఈ సినిమాను నంద‌కిషోర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి నివేదా తాజాగా ఓ ట్వీట్ చేసింది.

ఈ సినిమా నుంచి ఓ స్వీట్ స‌ర్ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ స‌ర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అని అభిమానులు గెస్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు.

కాగా, ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, విశ్వదేవ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు