సర్ప్రైజ్: ఈ ఓటీటీలో శ్రీవిష్ణు నట విశ్వరూపం.. స్ట్రీమింగ్ కి వచ్చేసిన “స్వాగ్”


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో తన వెర్సటాలిటీ తో అదరగొట్టిన నటుడు శ్రీవిష్ణు కూడా ఒకడు. మరి తను నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమానే “స్వాగ్”. దర్శకుడు హసిత్ గోలితో చేసిన ఈ సినిమా తమ కాంబినేషన్లో ఆల్రెడీ రాజ రాజ చోర వంటి క్లీన్ హిట్ తర్వాత మరి ఈ సినిమాలో మంచి కంటెంట్ ని మించి శ్రీవిష్ణు తన పెర్ఫార్మన్స్ తో ఆశ్చర్య చకితులను చేసాడని చెప్పాలి.

డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ వేరియేషన్ లతో తన నట విశ్వరూపంతో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా హక్కులు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు తప్పకుండా ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version