సర్ప్రైజ్ : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “టైగర్ 3”

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించిన క్రేజీ యాక్షన్ ఫ్రాంచైజ్ “టైగర్” సిరీస్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సిరీస్ లో గత ఏడాది వచ్చిన సినిమానే “టైగర్ 3”. మరి ఎన్నో అంచనాలు నడున వచ్చిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు ఇంట్రెస్టింగ్ క్యామియో పాత్రల్లో కూడా కనిపించారు. అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ విషయంలో గత రెండు రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ సస్పెన్ అయితే నెలకొంది.

మరి నిన్ననే ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని అతి త్వరలో స్ట్రీమింగ్ కి తీసుకొస్తామని కన్ఫర్మ్ చేశారు. కానీ గత కొన్ని రోజులు గా వినిపిస్తున్న డేట్ 7వ తారీఖున తీసుకొస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్ గా టైగర్ 3 చిత్రం ప్రైమ్ వీడియో లో దర్శనం ఇచ్చింది. ఒరిజినల్ హిందీ సహా డబ్బింగ్ భాషలు తెలుగు మరియు తమిళ్ వెర్షన్ లలో అయితే ఈ చిత్రం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మరి దీనితో అప్పుడు ఏమన్నా మిస్ అయినవారు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో లో నేటి నుంచి చూడవచ్చు. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మాణం వహించారు.

Exit mobile version