క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ‘పుష్ప-2’ అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ, కాకినాడ లో మూడు యూనిట్లు చక చక షూటింగ్ చేస్తున్నాయి. అన్నట్టు ఈ సినిమాకి సంబంధించి ఓ సాంగ్, కొంత మేర క్లైమాక్స్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఐతే, ఈ సినిమాలోని ఐటెమ్ సాంగ్ కోసం సుకుమార్ చాలా కసరత్తులు చేశాడు. ఇందులో భాగంగానే ఈ పాటలో నటించే హీరోయిన్ విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. జాన్వీ కపూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది.
ఇప్పుడు తాజాగా ఈ ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ కోసం శ్రద్ధాకి భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఐటమ్ సాంగ్ ను ఫుల్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే హీరోయిన్ ను రివీల్ చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.