కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, OTT సినిమాలు, సూరరై పొట్రు మరియు జై భీమ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తన రాబోయే చిత్రం ఎతర్కుం తునింధవన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
యాక్షన్ డ్రామా మార్చి 10, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా అధికారికం గా ప్రకటించడం జరిగింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
#EtharkkumThunindhavan is releasing on March 10th, 2022!
See you soon in theatres!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @sooriofficial #ETfromMarch10 #ET pic.twitter.com/HPJ9cYw9Eh— Sun Pictures (@sunpictures) February 1, 2022