ఆరోజు నేను కలిసి ఉంటే సుశాంత్ మరణించేవాడు కాదు.

Published on Jul 1, 2020 2:00 am IST


సుశాంత్ మరణించి రెండు వారాలు దాటిపోతున్నా…ఆయన మరణం పై చర్చ కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో సుశాంత్ మరణం గురించిన పోస్ట్స్, ట్వీట్స్ మనం చూస్తూనే ఉన్నాం. సుశాంత్ ఆత్మ హత్య బాలీవుడ్ లో పాతుకుపోయిన బంధుప్రీతిని ప్రశ్నించింది. నెటిజెన్స్ కొందరు వారసులను టార్గెట్ చేసి విమర్శలకు దిగారు. కాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సుశాంత్ మరణం పై స్పందించాడు.

ఆయన సుశాంత్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు…సుశాంత్‌ మరణం నన్ను కలిచివేసింది. ఒక విషయం నన్ను ఇంకా బాధపడేలా చేసింది. అదేంటంటే నేనుసుశాంత్ ను ముంబైలో చూశాను. అప్పుడు సుశాంత్‌ పొడుగైన జుట్టుతో ఉన్నాడు. అప్పుడు కొంత మంది అతను ఎంఎస్‌ ధోని సినిమాలో నటిస్తున్నాడని చెప్పారు. ఐతే నేను అతనితో మాట్లాడకుండా వెళ్లిపోయాను. అప్పుడు నేను సుశాంత్‌తో మాట్లాడి ఉంటే నేను జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను అతనితో పంచుకునే వాడిని. అతనికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది. నేను సుశాంత్‌తో మాట్లాడనందుకు చాలా బాధపడుతున్నాను, అని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More