హీరో కనిపించడు, పాత్ర కనిపిస్తుంది – జెమ్ సినిమా దర్శకుడు

హీరో కనిపించడు, పాత్ర కనిపిస్తుంది – జెమ్ సినిమా దర్శకుడు

Published on Sep 15, 2021 12:34 PM IST

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఒక గ్రామం లో 10 వ తరగతి వరకు చుదువుకున్నట్లు దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరు లో ఇంటర్, డిగ్రీ చదివి, సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. రైటర్ గా, చాలా మంది వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన విషయాన్ని వెల్లడించారు.

ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ తో విజయ్ రాజ, రాశి సింగ్, నక్షత్ర, హీరో హీరోయిన్ లుగా సినిమా చేసినట్లు తెలిపారు. నక్షత్ర రోల్ ఆసక్తికరం గా ఉంటుంది అని తెలిపారు. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ లు కమర్షియల్ గా నెక్స్ట్ సినిమాలకు కూడా సక్సెస్ అందుకుంటారు అని అన్నారు.

ఇద్దరు అమ్మాయిల మధ్య చిన్నప్పుడే ఒక జలసీ క్రియేట్ అవుతుంది.ఎడ్యుకేషన్ అలా కొన్ని విషయాల్లో జలసీ పోను పోనూ ఈగో గా మారుతుంది. వీరిద్దరి మధ్యలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ జలసీ కాస్త ఈగో గా మారడం మొదలు అవుతుంది. ఆ ఈగో కోసం వారు ఏం చేశారు, హీరో ఇవన్నీ ఎలా ఎదుర్కున్నాడు, తన లవ్ ను ఎలా గెలిపించుకున్నాడు అనేది పక్కా కమర్షియల్ చిత్రం గా ముందుకు రానుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది.

ఇందులో హీరో పాత్ర స్పంటేనిటి గా అలోచిస్తాడు, సూపర్ హీరో కు ఉండాల్సిన లక్షణాలు, కథ కి, హీరో కి ఉండటం తో సినిమా కి జెమ్ అని టైటిల్ ను పెట్టినట్లు తెలిపారు. హీరో పేరు సినిమా లో జెమ్. ఇది నిజంగా జెమ్ సినిమా అంటూ ప్రేక్షకులు చెబుతారు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ చిత్రం లో ఈగో కనిపిస్తుంది. తన కథ ఈగో అంటూ చెప్పుకొచ్చారు. కథ నిర్మాత కి నచ్చడం తో ఒప్పుకున్నారు అని తెలిపారు. శివాజీ రాజా వాళ్ళ అబ్బాయి కి కథ నచ్చడంతో చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 17 కి థియేటర్ల లో కలుద్దాం అని అన్నారు.

హీరో కనిపించడు, పాత్ర కనిపిస్తుంది. కథకి న్యాయం చేశా అని చెబుతా. హీరో ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ధియేటర్ కి వచ్చే ఆడియెన్స్ కి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలి, ఎంజాయ్ చేసి వెళ్ళాలి.

ఈ సినిమా లో అజయ్, సంపూర్నేష్ బాబు లు చాలా బాగా చేశారు. బ్రేకప్ చెప్పాలి అంటే, క్రష్ అని చెప్తారు, దానికి లవ్ అని చెప్పరు అంటూ ట్రైలర్ లో సన్నివేశం ను వివరించారు.

సునీల్ కష్యప్ అద్దిరిపోయే సంగీతం ఇచ్చారు. వండర్ ఫుల్ రీ రికార్డింగ్ ఇచ్చారు. కెమెరా మెన్ పనితనం సినిమా లో చాలా బావుంటుంది. హీరోయిన్ ల పర్ఫామెన్స్ మీద కథ ఆధారపడి ఉంది.

ఫస్ట్ కాపీ చూసా,సెన్సార్ బోర్డ్ సభ్యులు చాలా మెచ్చుకున్నారు సినిమా చూసి అని అన్నారు. ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్లు అయింది. ముందు రెండు మూడేళ్లు తిరిగా, స్క్రిప్ట్ బాగా లేకపోవడం వలన ఆలస్యం అవుతుంది అని, అందుకే రైటర్ గా, అసిస్టెంట్ గా చేసినట్లు తెలిపారు. అనంతరం డైరెక్టర్ గా చేసినట్లు తెలిపారు. మల్టీ స్టారర్ చేసే అవకాశం ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు