SWAG: ‘శ్వాగ్’ నుంచి నాలుగో సింగిల్ ‘నీలో నాలో..’పై అప్డేట్

SWAG: ‘శ్వాగ్’ నుంచి నాలుగో సింగిల్ ‘నీలో నాలో..’పై అప్డేట్

Published on Sep 26, 2024 8:09 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్వాగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు ఏకంగా 4 పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా, ఇప్పుడు ఈ మూవీలోని నాలుగో సింగిల్ సాంగ్ ‘నీలో నాలో..’ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మెలోడి పాటను సెప్టెంబర్ 27న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈమేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ విష్ణుతో పాటు మీరా జాస్మిన్ కనిపిస్తున్నారు. వీరిద్దరిపై ఈ పాట ఉండబోతుంది.

ఇక ఈ సినిమాలో రీతూ వర్మ, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు