SWAG: ‘ఇంగ్లండు రాణి’ అంటూ పాటందుకున్న ‘అనుభూతి’

SWAG: ‘ఇంగ్లండు రాణి’ అంటూ పాటందుకున్న ‘అనుభూతి’

Published on Sep 19, 2024 11:02 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న క్రేజీ మూవీ ‘స్వాగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయగా, పూర్తి వైవిధ్యమైన కథతో ఈ సినిమా రానుందని మేకర్స్ కాన్పిడెంట్‌గా చెబుతున్నారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమాలో ‘అనుభూతి’ అనే పాత్రలో నటిస్తున్నట్లుగా ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. అంతేగాక, ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ ‘ఇంగ్లండు రాణి’ అనే పాటను సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్, దక్ష నాగర్కర్, రవిబాబు, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ 4న స్వాగ్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు