సొట్టబుగ్గల సుందరి తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉంది. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. ఐతే, తాజాగా ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైనట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నెల 23న ఉదయ్పుర్లో తాప్సీ- మథియాస్ బోతో పెళ్లి జరిగిందని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక తాజాగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
పైగా ఆ ఫోటోలకు ‘నా స్నేహితుల పెళ్లిలో’ అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. దీంతో నిజంగానే తాప్సీ పెళ్లి జరిగింది అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా తన పెళ్లి పై తాప్సీ స్పందిస్తూ.. ‘పెళ్లి అనేది అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగం. దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఇంతకీ తాప్సీ పెళ్లి జరిగిందా ?, లేదా ? అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.