సాయి తేజ్ సినిమాలోకి టాలెంటెడ్ హీరోయిన్ ఎంట్రీ

సాయి తేజ్ సినిమాలోకి టాలెంటెడ్ హీరోయిన్ ఎంట్రీ

Published on Sep 6, 2024 1:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా తన కెరీర్ 18వ సినిమాని ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్సమెంట్ నాటి నుంచి మంచి హైప్ ని సెట్ చేసుకుంది. ఇక మేకర్స్ ఈ చిత్రం నుంచి నేడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ సౌత్ నటి ఐశ్వర్య లెక్ష్మి నటిస్తున్నట్టుగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేసి అనౌన్స్ చేశారు. మరి ఇందులో ఆమె ఏదో ఎడారి ప్రాంతంలో నాగజెముడు మొక్కల ముందు కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ఈమె వసంత అనే పాత్రలో కనిపించనుందట. ఇక ఈ భారీ చిత్రానికి హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని ఈ చిత్రం జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు