స్టార్ హీరోకి టాలెంటెడ్ హీరో డబ్బింగ్ ?

స్టార్ హీరోకి టాలెంటెడ్ హీరో డబ్బింగ్ ?

Published on May 24, 2020 7:39 PM IST


సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సూర్య‌ పాత్రకు తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి యంగ్ హీరో స‌త్య‌దేవ్‌ ఓకే చెప్పార‌ట. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స‌త్య‌దేవ్ వాయిస్ సూర్య‌కు బాగుంటుంది.

కాగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది.

అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సూర్యకి గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే సూర్య ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు