నెగిటివ్ రోల్ లో టాలెంటెడ్ హీరో ?

Published on Aug 2, 2020 11:33 pm IST

బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా నుండి ఇద్దరు హీరోలు తప్పుకున్నాక, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందట. ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

More