సూపర్ స్టార్ బ్యానర్ లో టాలెంటెడ్ హీరో !

Published on Oct 26, 2020 9:09 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంబీ ప్రొడక్షన్స్ అనే తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి తన ప్రతి సినిమాని ఈ కంపెనీలో ఇన్ వాల్వ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ ను కూడా సమర్ధవంతంగా హ్యాండిల్ చేస్తూ.. మహేష్ పర్ఫెక్ట్ యాక్టర్ తో పాటు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా కూడా రాణిస్తున్నాడు. పైగా తన ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తూనే మరో యంగ్ హీరోతో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడట. యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉందని నిరూపించుకున్న నవీన్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే తన ప్రొడక్షన్ లో నవీన్ తో ఓ సినిమా చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడట. న‌వీన్ లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా కూడా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More