టాక్ : ఎట్టకేలకు సెట్స్ మీదకు దీపిక పదుకొనె హాలీవుడ్ రీమేక్ ?

టాక్ : ఎట్టకేలకు సెట్స్ మీదకు దీపిక పదుకొనె హాలీవుడ్ రీమేక్ ?

Published on Dec 6, 2023 2:30 AM IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన దీపికా పదుకొనె తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడి తో పాటు బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ నటిస్తోన్న ఫైటర్ మూవీ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. ప్రారంభం నాటి నుండి హీరోయిన్ గా పలు పాత్రల్లో తన అత్యద్భుతమైన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ప్రస్తుతం ఇండియా వైడ్ ఎంతో క్రేజ్ తో దూసుకెళ్తూ ఉన్నారు దీపికా.

విషయం ఏమిటంటే, హాలీవుడ్ హిట్ మూవీ ది ఇంటర్న్ యొక్క అధికారిక హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి యాక్ట్ చేయనున్నట్లు 2021లో దీపిక వెల్లడించారు. అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్ ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు రాగా ఇటీవలి బాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క చిత్రీకరణలో దీపిక జనవరి 2024 నుండి పాల్గొననున్నారని అంటున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ వెలువడాల్సి ఉంది. ఈ మూవీకి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనుండగా దీపికా పదుకొనే మరియు సునీర్ ఖేటర్‌పాల్ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు