మన ఇండియా సినిమా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన చిత్రం చిత్రం “వలిమై” ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తమిళ నాట బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకొని దూసుకెళ్తుంది.
దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మన టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా మరి ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ కి సంబంధించి టాక్ వినిపిస్తుంది.
దీని ప్రకారం అయితే ఈ మార్చ్ 25 నుంచి ఈ భారీ సినిమా స్ట్రీమింగ్ కి రానున్నట్టు తెలుస్తుంది. అలాగే దీనిని జీ 5 వారు అందుబాటులోకి తీసుకురానున్నారట. మరి అన్ని భాషల్లోని ఒకేసారి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వగా బోనీ కపూర్ నిర్మాణం వహించారు.