టాక్..యష్ నెక్స్ట్ పై అప్పుడు క్లారిటీ.!

టాక్..యష్ నెక్స్ట్ పై అప్పుడు క్లారిటీ.!

Published on Mar 30, 2023 8:00 PM IST

తన సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్స్ సినిమాలు కేజీయఫ్ ఫ్రాంచైజ్ తో అయితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీయఫ్ లాంటి హిట్స్ తర్వాత మారిన తన క్యాలిబర్ కి తగ్గ సినిమా తాను చేస్తాడా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే దీనిపై ఆల్రెడీ నిర్మాత నిర్మాణ సంస్థ లాక్ అయ్యాయి కానీ ఇంకా దర్శకుడు ఎవరు ఇతర అప్డేట్స్ మాత్రం ఏవి బయటకి రాలేదు. కానీ ఇప్పుడు దీనిపై ఈ ఏప్రిల్ లో సాలిడ్ క్లారిటీ రానున్నట్టుగా సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. ఈ ఏప్రిల్ 14 న మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది యష్ నుంచి 19వ సినిమా కోసమా లేక వేరే కొత్త ప్రాజెక్ట్ కోసమా అనేది మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు