టాక్..విజయ్ “వారసుడు” రిలీజ్ డేట్ ఫిక్స్..?

Published on Oct 5, 2022 1:38 am IST


ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “వారసుడు” కోసం అందరికీ తెలిసిందే. తమిళ్ లో “వరిసు” పేరిట రిలీజ్ చేయనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఆల్రెడీ మేకర్స్ అయితే ఎప్పుడో క్లారిటీ కూడా ఇచ్చేసారు.

ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ డేట్ కి సంబంధించి అయితే ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 12నే థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట. మరి ఇదే కన్ఫర్మ్ అయ్యినట్టు అయితే ఆదిపురుష్ తో భారీ క్లాష్ తప్పదని చెప్పి తీరాలి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :