‘ఓదెల 2’లో నా క్లోజప్ షాట్స్ ఆకట్టుకుంటాయి – తమన్నా

‘ఓదెల 2’లో నా క్లోజప్ షాట్స్ ఆకట్టుకుంటాయి – తమన్నా

Published on Mar 23, 2025 12:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం ‘ఓదెల 2’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కి్స్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిత్ర యూనిట్ ముచ్చటించారు.

ఈ ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ.. ‘ఓదెల 2’ చిత్రం తనకు చాలా దగ్గరగా అనిపించిందని.. అందుకే ఈ సినిమాను ఆమె చేసినట్లు తెలిపింది. ఇక ఈ సినిమా చేయడానికి భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడని.. అందుకే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదిగా తమన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తనపై వచ్చే క్లోజప్ షాట్స్ తన కెరీర్‌లోనే బెస్ట్ షాట్స్ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ సినిమాకు సంపత్ నంది కథను అందించడంతో పాటు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు