మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి ప్రధాన పాత్రల్లో నటించిన అరణ్మనై 4 మరోసారి వార్తల్లో నిలిచింది. సుందర్ సి దర్శకత్వం వహించిన హార్రర్ కామెడీ, మొదట ఏప్రిల్ 26, 2024 న విడుదల చేయడానికి సెట్ చేయబడింది. తాజాగా మరో కొత్త తేదీకి వాయిదా పడింది. ముందుగా అనుకున్న దానికంటే వారం ఆలస్యంగా మే 3, 2024న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
తెలుగు లో ఈ చిత్రం బాక్ పేరుతో రిలీజ్ కనుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్‌మెంట్ LLP నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుందర్ భార్య ఖుష్భు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో కోవై సరళ, యోగి బాబు, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, సునీల్, కెఎస్ రవికుమార్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం హిప్హాప్ తమిజా స్వరాలు సంగీతం అందించారు.