మహేష్ తో తమన్నా స్పెషల్ సాంగ్ ?

మహేష్ తో తమన్నా స్పెషల్ సాంగ్ ?

Published on Dec 4, 2022 8:46 PM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ చేయించబోతున్నారు. ఐతే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది.

పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు