తమిళ హీరోకు యాక్సిడెంట్.. నుజ్జునుజ్జయిన కారు!

తమిళ హీరోకు యాక్సిడెంట్.. నుజ్జునుజ్జయిన కారు!

Published on Sep 11, 2024 5:03 PM IST

తమిళ హీరో జీవా కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో కోలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జీవా తన కుటుంబంతో ప్రయాణిస్తున్న కారు, ఓ బైకును తప్పించబోయి డివైడర్‌ని ఢీ కొట్టిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

జీవా తన భార్యతో కలిసి చెన్నై నుంచి సాలెంకు తన కారులో ప్రయాణిస్తుండగా.. కొన్నియమూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయారు. ఈ ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొట్టగా, కారు నుజ్జునుజ్జయ్యింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన జీవా, ‘యాత్ర-2’ సినిమాలో నటించి మెప్పించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు