నాలుగు తరాల హీరోయిన్లతో స్టెప్పులేయనున్న శింబు..?

నాలుగు తరాల హీరోయిన్లతో స్టెప్పులేయనున్న శింబు..?

Published on Feb 10, 2015 2:03 AM IST

tamil-hero-simbu-dance-with
తమిళ యువ హీరో శింబు, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం ‘వాలు’. బ్రేక్ అప్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ చందర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు తరాలకు చెందిన హీరోయిన్లతో కలిసి శింబు ఓ పాటలో స్టెప్పులేయనున్నాడనే వార్త చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అలనాటి అగ్ర హీరోయిన్ బి.సరోజినీ దేవి, ఖుష్బూ, సిమ్రాన్, నయనతారలు ఈ పాటలో శింబుతో కలిసి సందడి చేయనున్నారట. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెండితెరపై ఈ పాట అభిమానులకు కనులవిందు చేస్తుందని, కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు