హృతిక్ సినిమాకి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్..!

Published on Sep 22, 2022 12:05 pm IST

T

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ భారీ చిత్రం “విక్రమ్ వేద” కోసం తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ అలాగే మరో స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించిన ఈ చిత్రాన్ని గాయత్రీ పుష్కర్ లు దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకి వచ్చింది.

ఈ చిత్రం ఒరిజినల్ గా తమిళ్ సినిమా విక్రమ్ వేద కి రీమేక్ గా చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాకి ఒరిజినల్ స్కోర్ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిందీ వెర్షన్ లో కూడా సాలిడ్ మ్యూజిక్ ని ఇచ్చినట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పుడు విక్రమ్ వేద హిందీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కంప్లీట్ చేసానని దర్శకులు మరియు హీరో హృతిక్ రోషన్ కి స్పెషల్ థాంక్స్ చెబుతున్నానని ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలిపాడు. అలాగే ఈ సినిమాకి తన వర్క్ నచ్చుతుంది అని తాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మరి ఈ అవైటెడ్ చిత్రం చిత్రం అయితే ఈ సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :