‘మహేష్ – రాజమౌళి’ సినిమా బడ్జెట్‌ 1000 కోట్లు

‘మహేష్ – రాజమౌళి’ సినిమా బడ్జెట్‌ 1000 కోట్లు

Published on Nov 11, 2024 9:58 AM IST


దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, తమ్మారెడ్డి భరద్వాజ ఏం మాట్లాడారంటే.. ‘మహేశ్‌ బాబు – రాజమౌళి సినిమా బడ్జెట్‌ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చు. అలాగే, ఈ చిత్రంలో ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు కూడా నటించబోతున్నారు.

కాబట్టి, ఈ సినిమా బిజినెస్‌ మినిమమ్ రూ.2000 కోట్లు దాటొచ్చని టీమ్‌ అంచనా వేస్తోంది. అంతకుమించి ఎంతైనా వసూలు చేసే అవకాశం ఉంది. ఆ నంబర్‌ రూ.3, 4 వేల కోట్ల వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. తెలుగు సినిమాలోనే కాదు.. భారతదేశ సినీరంగంలోనే ఈ చిత్రం చరిత్ర అవుతుంది’ అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు