సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి “సైరా” మూవీ పై మొదటిసారి తన స్పందన తెలియజేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియా తో మాట్లాడారు.ప్రతిష్టాత్మకంగా కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న “సైరా” మెగా ఫ్యామిలి అంచనాలకు మించి ఉంటుందన్నారు. చలన చిత్ర రంగంలో ఈ మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం అన్నారు. సినిమా ఆలస్యమైనందుకు అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు, కష్టానికి ఫలితం తెరపై చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పారు.
తాను ఈ మూవీలో ఓ విలక్షణమైన పాత్ర చేస్తున్నాను. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం కలిపించినందుకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తాను ఓ మూవీకి దర్శకత్వం వహించబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి బయటపెట్టారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరు సరసన నయనతార చేస్తుండగా, అమితాబ్,జగపతి బాబు, సుదీప్,విజయసేతుపతి,అనుష్క,తమన్నా వంటి మేటి తారలు నటిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.