సమీక్ష : తంత్ర – రొటీన్ హారర్ రివెంజ్ డ్రామా !

సమీక్ష : తంత్ర – రొటీన్ హారర్ రివెంజ్ డ్రామా !

Published on Mar 16, 2024 3:04 AM IST
Tantra Movie Review in Telugu

విడుదల తేదీ: మార్చి 15, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు.

దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి

నిర్మాత: నరేష్ బాబు పి, రవి చైతన్య

సంగీత దర్శకుడు: ఆర్ ఆర్ ధృవన్

సినిమాటోగ్రాఫర్‌: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల

ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

రేఖ (అనన్య నాగళ్ళ) చాలా అమాయకమైన అమ్మాయి. ఆమె చుట్టూ ఎప్పుడూ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది. మరోవైపు తేజు (ధనుష్ రఘుముద్రి) ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు. కాకపోతే ఓ వేశ్య కొడుకు కావడం వల్ల తేజు ఎన్నో అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో రేఖ – తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది. కానీ, అసలు రేఖ చుట్టూ దెయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి?, ఆమె రక్తమే ఆమె ఎందుకు తాగుతుంది ?, ఇంతకీ, రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి?, చివరకు రేఖ తన ప్రేమ కోసం ఏం చేసింది ?, తనను తాను ఎలా కాపాడుకుంది?, అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

క్షుద్ర శక్తులతో ఓ పాప పుట్టి పెరిగితే, ఆ అమ్మాయి చుట్టూ దెయ్యాలు, భూత, ప్రేత, పిశాచాలు తిరుగుతూ ఉంటే, ఆ అమ్మాయిని బలి ఇచ్చి క్షుద్ర శక్తులు పొందాలనుకునే ఓ మాంత్రికుడు ఏం చేశాడు ? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ రివేంజ్ హారర్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం పర్వాలేదు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన అనన్య నాగళ్ళ పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ హారర్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సలోని పాత్ర.. ఆమెకు జరిగిన అన్యాయం, దానికి అనన్య నాగళ్ళ రివేంజ్ జర్నీ ఇలా మొత్తానికి ‘తంత్ర’ సినిమా కొన్ని చోట్ల జస్ట్ పర్వాలేదు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య నాగళ్ళ చాలా బాగా నటించింది. హీరోగా నటించిన ధనుష్ రఘుముద్రి తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన సలోని కూడా బాగానే నటించింది. విలన్ పాత్రలో టెంపర్ వంశీ నటన బాగుంది. అలాగే మీసాల లక్ష్మణ్ కూడా మరో కీలక పాత్రలో చాలా బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

క్షుద్ర శక్తులు, దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. దీనికి తోడు ఈ మధ్య హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. ఈ క్రమంలో అలాంటి ఓ నేపథ్యంలో ఈ తంత్ర చిత్రం వచ్చింది. అసలు హీరోయిన్ పాత్ర చుట్టూ దెయ్యాలు తిరగడం, ఆమె రక్తం కోసం రాత్రులు అరుపులు.. ఇలా అర్థం పర్థం లేకుండా సాగింది ఈ సినిమా ప్లే. పైగా తీసుకున్న కథలో అనేక ఉపకథలు కూడా ఎక్కువ అయిపోయాయి. వాటికి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి ఉండి ఉంటే.. అసలు కథలోని మెయిన్ మోటివ్ బాగా వర్కౌట్ అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు.

అలాగే, ఈ ‘తంత్ర’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు ప్రధాన పాత్ర అనన్య క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం, ఇంట్రెస్టింగ్ ప్లే లేకపోవడం అంశాల కారణంగా సినిమా బాగాలేదు. మొత్తమ్మీద దర్శకుడు ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. .

 

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు ఆర్.ఆర్ ధృవన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ లు సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాతలు నరేష్ బాబు పి, రవి చైతన్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘తంత్ర’ అంటూ వచ్చిన ఈ హారర్ రివేంజ్ డ్రామాలో కొన్ని హారర్ సీన్స్ అండ్ ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా, సినిమా మాత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

విడుదల తేదీ: మార్చి 15, 2024 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5 నటీనటులు: అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు. దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాత: నరేష్ బాబు పి, రవి చైతన్య సంగీత దర్శకుడు: ఆర్ ఆర్ ధృవన్ సినిమాటోగ్రాఫర్‌: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్ సంబంధిత లింక్స్: ట్రైలర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో...సమీక్ష : తంత్ర - రొటీన్ హారర్ రివెంజ్ డ్రామా !