“RRR” నుంచి తారక్ ఫీస్ట్ ఈ ఏడాదేనా.?

Published on Sep 17, 2020 3:00 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం”. భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం కోసం యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఈ చిత్రంలో అల్లూరిగా కనిపించనున్న రామ్ చరణ్ లుక్ మరియు టీజర్ బయటకొచ్చి భారీ రెస్పాన్స్ ను అందుకుంది.

దీనితో ఇక అందరి కళ్ళు కొమరం భీం గా కనిపించనున్న తారక్ లుక్ అండ్ టీజర్ కోసం ఎదురు చూస్తే మధ్యలో కరోనా కాటుకు చాలా కాలం నిరీక్షణ తప్ప లేదు. దానితో రాజమౌళి ఈ చిత్రం షూట్ మొదలు పెట్టిన మూడు వారాల్లో మంచి అకేషన్ నాడు తారక్ లుక్ ను రివీల్ చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఇదిలా ఉండగా వచ్చే అక్టోబర్ మొదటి వారంలో లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.ఇక దీనితో ఎలాంటి బ్రేక్ లేకుండా కనుక ఈ షూట్ మొదలయితే ఈ ఏడాదే “RRR” నుంచి తారక్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయం అని చెప్పాలి. ఇప్పటికే తారక్ అభిమానులు చాలా ఆసక్తిగా ఈ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఏమవుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More