బన్నీ-పూజ ల మెస్మరైజింగ్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది.

బన్నీ-పూజ ల మెస్మరైజింగ్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది.

Published on Feb 25, 2020 8:51 PM IST

అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ చిత్రం టాలీవుడ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలవడంతో పాటు, నాన్ బాహుబలి రికార్డ్స్ దక్కించుకుంది. అల్లు అర్జున్ పెరఫార్మెన్సు, త్రివిక్రమ్ టేకింగ్ తో పాటు థమన్ అందించిన సాంగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అందులోని బుట్ట బొమ్మా సాంగ్ యూత్ ని ఊపేసింది.

కాగా ఇప్పుడు చిత్ర యూనిట్ బుట్ట బొమ్మా సాంగ్ ఫుల్ వీడియో విడుదల చేశారు. అల్లు అర్జున్ గ్రేసింగ్ స్టెప్స్, పూజ హెగ్డే గ్లామర్ మరో సారి ఎంజాయ్ చేయాలనుకునే వారు యూట్యూబ్ లో ఈ సాంగ్ చూసి ఆనందించవచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో టబు, సుశాంత్, మురళి శర్మ, నివేద పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు