వరల్డ్ వైడ్ గా మంచి పాపులార్టీ ఉన్న స్పోర్ట్స్ లో క్రికెట్ కూడా ఒకటి. ఇక మన దేశంలో అయితే ఇదొక ఎమోషన్ అనే చెప్పాలి. పలు కీలక మ్యాచ్ లని మనవాళ్ళు చాలా రసవత్తరంగా వీక్షిస్తారు. ఇలా ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టోర్నమెంట్ లో భారత జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. అయితే ఈసారి జరుగుతున్న టోర్నీలో భారత్ జట్టు ఆసీస్ ని చిత్తుగా ఓడించి ఫైనల్స్ కి చేరుకుంది. అయితే ఈ ఫైనల్స్ లో మన విజయానికి గల అవకాశాలు ఏంటో చూద్దాం.
మొదటగా బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి అయితే తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ని కూడా టర్న్ చేసి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. గత నాలుగు మ్యాచ్‌లలో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్లను అవుట్ చేసిన ప్రదర్శన చాలా బాగుంది.
గత ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో భారత జట్టు ప్రదర్శన చూస్తే:
2002: భారత్ మరియు శ్రీలంక జట్లు కలిపి విజేతగా ప్రకటించబడ్డాయి.
2013: ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది.
2017: ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.
ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్ళ ఫామ్ ఎలా ఉంది?
బ్యాటింగ్:
రోహిత్ శర్మ (Rohit Sharma): ఓపెనర్ గా వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కీలకమైన స్టార్ట్ ని భారత్ జట్టుకి అందిస్తున్నాడు.
విరాట్ కోహ్లీ (Virat Kohli): ఫామ్ కోల్పోయాడు అని పలు కామెంట్స్ రన్ మెషిన్ కోహ్లీపై వచ్చాయి కానీ ఈ టోర్నమెంట్ లో తన బాటింగ్ తో స్థిరమైన రన్ రేట్ తో కింగ్ కోహ్లీ గేమ్ ఛేంజర్ గా నిలిచాడు.
శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer): మిడిల్ ఆర్డర్ లో వస్తున్న శ్రేయాస్ అయ్యర్ భారత జట్టు విజయానికి కీలకమైన నాక్ ని తాను అందిస్తూ వస్తున్నాడు.
బౌలింగ్:
వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy): తన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు, ఇది భారత్‌కు కీలకమైన విజయాన్ని అందించింది. అలాగే ఆసీస్ మ్యాచ్ లో కూడా హెడ్ వికెట్ పడగొట్టడంతో తాను మరింత కీలకంగా మారాడు.
మొహమ్మద్ షమీ (Mohammed Shami): బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. అలాగే ఇదే ఫామ్ ని తాను మిగతా మ్యాచ్ లలో కూడా కొనసాగిస్తున్నాడు.
ఫైనల్స్ లో గెలుపు అవకాశాలు:
భారత జట్టు ప్రస్తుత ఫామ్ మరియు గత విజయాల ఆధారంగా ట్రోఫీని గెలుచుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలకమైన ఆటగాడు లేనప్పటికీ కూడా టీమిండియా సమిష్టి కృషితో పలు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఫైనల్స్ కి వచ్చి కప్ కొట్టేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అటు బాటింగ్ ఇటు బౌలింగ్ లో కూడా భారత జట్టు మంచి పెర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది.
ఇక ఓవరాల్ గా, భారత్ ప్రస్తుత ఫామ్ మరియు గత విజయాల ఆధారంగా ట్రోఫీని గెలుచుకునే అవకాశాలు బాగున్నాయి. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో ఎదురయ్యే ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్ ని బట్టి వ్యూహాలను మార్చి బరిలోకి దిగితే భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తప్పక గెలిచి తీరుతుంది.